Vizag: ఆ రెండు మాటలూ చెప్పగలరా?: చంద్రబాబుకు స్పీకర్ తమ్మినేని సవాల్

  • విశాఖ, కర్నూలు అభివృద్ధి వద్దా?
  • కార్య నిర్వాహక రాజధాని, హైకోర్టు వద్దని చెప్పగలరా?
  • విశాఖలో డిమాండ్ చేసిన తమ్మినేని
విశాఖపట్నంలో కార్య నిర్వాహక రాజధాని వద్దని, కర్నూలులో హైకోర్టు వద్దని చంద్రబాబు చెప్పగలరా? అని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సవాల్ విసిరారు. ఆయనకు దమ్ముంటే విశాఖ, కర్నూలులో అభివృద్ధి వద్దని చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఉదయం విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు. అక్కడ కనీస వసతులు కూడా లేవని చెప్పారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దమ్మున్న నాయకుడని, ఆయనకు అన్ని ప్రాంతాల ప్రజలూ ఒకటేనని, అందరినీ సమాన భావంతోనే చూస్తారని చెప్పారు. కొంతమందిని తీసుకుని మంగళగిరి ప్రాంతంలో టీడీపీ ధర్నాలు చేయిస్తోందని ఆరోపించిన తమ్మినేని, విశాఖ, కర్నూలు అభివృద్ధిని చంద్రబాబు కోరుకోవడం లేదా? అని ప్రశ్నించారు.
Vizag
Kurnool District
Tammineni
Chandrababu

More Telugu News