Farook Abdullah: ఆగస్ట్ 5 తరువాత తొలిసారి సమావేశమైన పీడీపీ, ఎన్సీ నేతలు!

  • కశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్రం
  • అప్పటి నుంచి ప్రధాన పార్టీల నేతలు గృహ నిర్బంధంలోనే
  • సమావేశమైన పార్టీల ముఖ్య నేతలు

కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370, 35ఏ రద్దు చేసిన తరువాత తొలిసారిగా ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్, మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ తొలిసారిగా శ్రీనగర్ లో ఓ సమావేశాన్ని నిర్వహించాయి. పార్టీ అధినేతల ఆదేశాలతో ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య ఈ సమావేశం జరిగిందని, రాష్ట్రంలో తిరిగి పూర్వ పరిస్థితులు ఏర్పడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వీరు చర్చించారు.

కాగా, ఎన్సీ, పీడీపీ పార్టీల అధినేతలు ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. తమ పార్టీ నేతలతో మాట్లాడేందుకు వీరికి ఫోన్ సౌకర్యాన్ని కల్పించారు. ఫరూక్ అబ్దుల్లాకు మొబైల్ ఫోన్ ను, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా, మెహబూబాలు ల్యాండ్ లైన్ల నుంచి ఫోన్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించారు. దీంతో వీరంతా బయట ఉన్న తమ తమ పార్టీల ముఖ్య నేతలతో మంతనాలు జరుపుతూ, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చిస్తున్నారు.

More Telugu News