Prakasam District: ప్రకాశం జిల్లాలో రాజధాని ఏర్పాటు చేసుంటే ప్రాంతాల మధ్య సమతౌల్యం వచ్చేది: మంద కృష్ణ

  • ఏపీ రాజధానిపై మంద కృష్ణ వ్యాఖ్యలు
  • సీఎం తన ప్రతిపాదన విరమించుకోవాలని హితవు
  • రాజధాని విషయంలో గందరగోళం ఏర్పడిందన్న ఎమ్మార్పీఎస్ నేత

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ ఏపీ రాజధాని అంశంపై స్పందించారు. రాజధాని విషయంలో గందరగోళం ఏర్పడిందని, అందుకు కారణం చంద్రబాబు, జగన్ లేనని ఆరోపించారు. తమ రాజధాని ఎక్కడ ఉంటుందో అర్థంకాని స్థితిలో ఏపీ ప్రజలున్నారని వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లాలోని దొనకొండలో రాజధాని ఏర్పాటు చేసుంటే ప్రాంతాల మధ్య సమతౌల్యం వచ్చేదని అభిప్రాయపడ్డారు. అయితే, రాజధాని నిర్మాణ ప్రక్రియ కొనసాగుతున్న దశలో సీఎం జగన్ మూడు రాజధానులు అంటూ ప్రకటన చేయడం ఆశ్చర్యకర నిర్ణయంగా అభివర్ణించారు.

జీఎన్ రావు కమిటీ కంటే ముందే జగన్ రాజధానులపై మాట్లాడడం, చివరికి జీఎన్ రావు కమిటీ నివేదికలోనూ అవే అంశాలుండడం చూస్తుంటే జగన్ తాను కోరుకున్న నివేదికనే తెప్పించుకున్నట్టు భావించాల్సి వస్తోందని అన్నారు. జగన్ ఇప్పటికైనా తన ప్రతిపాదన విరమించుకుంటే రాష్ట్రానికి మేలు చేసినవారవుతారని మంద కృష్ణ హితవు పలికారు.

More Telugu News