Telangana: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • జనవరి 7న ఎన్నికల నోటిఫికేషన్
  • జనవరి 22న పోలింగ్
  • జనవరి 25న కౌంటింగ్..ఫలితాల వెల్లడి
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. ఈ రోజు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను విడుదల చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. వచ్చే నెలలో ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి.. పూర్తి చేయనున్నట్లు ఎన్నికల కమిషన్  తెలిపింది. జనవరి 7న నోటిఫికేషన్ జారీచేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. జనవరి 8 నుంచి 10వరకు నామినేషన్ల సమర్పణకు గడువు విధించగా, జనవరి 11న నామినేషన్ల పరిశీలన జరపనుంది. 12, 13వ తేదీల్లో తిరస్కరణకు గురైన నామినేషన్లకు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించింది. నామినేషన్ల ఉపసంహరణకు జనవరి 14వరకు గడువు విధించింది. పోలింగ్ తేదీగా జనవరి 22ను నిర్ణయించింది. జనవరి 25న కౌంటింగ్ ప్రక్రియ.. ఫలితాల వెల్లడి చేయనున్నట్లు తెలిపింది.
Telangana
Municipal Electons
Shedule Release
Notification Issu on January 7th

More Telugu News