Lokayouktha- upa Lokayouktha: తెలంగాణ రాజ్ భవన్ లో లోకాయుక్త, ఉపలోకాయుక్తలు ప్రమాణ స్వీకారం

  • లోకాయుక్తగా జస్టిస్ సీవీ రాములు, ఉపలోకాయుక్తగా వి.నిరంజన్ రావు నియామకం
  • గవర్నర్ తమిళిసై సమక్షంలో ప్రమాణ స్వీకారం
  • హాజరైన సీఎం కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులు
తెలంగాణలో లోకాయుక్త, ఉపలోకాయుక్తల ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చింతపంటి వెంకట రాములును, జిల్లా సెషన్స్ విశ్రాంత న్యాయమూర్తి వి.నిరంజన్ రావును ఉపలోకాయుక్తగా నియమిస్తూ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. రాజ్ భవన్ లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై వీరిచేత ప్రమాణం స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై వీరికి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
   
Lokayouktha- upa Lokayouktha
Telangana
CV Ramulau
V. Niranjamrao
Takes oath

More Telugu News