దిశ హత్యకేసు నిందితుల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించిన పోలీసులు

23-12-2019 Mon 16:38
  • ముగిసిన రీపోస్టుమార్టం
  • రెండు అంబులెన్స్ లలో స్వగ్రామాలకు మృతదేహాల తరలింపు
  • రెండ్రోజుల్లో హైకోర్టుకు అందనున్న రీపోస్టుమార్టం రిపోర్టు

దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిశ హత్యకేసు నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం ముగిసింది. దాదాపు 4 గంటల సేపు ఈ ప్రక్రియను నిర్వహించారు. అనంతరం నాలుగు మృతదేహాలను వారి కుటుంబీకులకు పోలీసులు అప్పగించారు. రెండు అంబులెన్స్ లలో మృతదేహాలను వారి గ్రామాలకు తరలించారు. ఈరోజే మృతదేహాలకు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.

మృతుల కుటుంబీకుల సమక్షంలోనే ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్ వైద్యులు రీపోస్టుమార్టంను నిర్వహించారు. ఈ ప్రక్రియను మొత్తం వీడియో షూట్ చేశారు. ఎయిమ్స్ బృందమే ఈ వీడియో చిత్రీకరణ జరిపినట్టు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ తెలిపారు. మరో రెండు రోజుల్లో రీపోస్టుమార్టం రిపోర్టును ఎయిమ్స్ వైద్యులు హైకోర్టుకు అందించనున్నారు.