Sukumar: నిజంగానే థియేటర్లలో పండుగ చేస్తోంది: దర్శకుడు సుకుమార్

  • కంటెంట్ నాకు బాగా నచ్చింది 
  • బన్నీ వాసు - మారుతి నాకు మంచి మిత్రులు 
  •  ఈ విజయంలో అందరి పాత్ర వుందన్న సుకుమార్

మారుతి దర్శకత్వంలో రూపొందిన 'ప్రతిరోజూ పండుగే' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీని ఆసరాగా చేసుకుని ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా సాగిన ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. సక్సెస్ ఫుల్ గా ఈ సినిమా రన్ అవుతుండటం గురించి తాజాగా దర్శకుడు సుకుమార్ స్పందించాడు.

'ప్రతిరోజూ పండగే' కంటెంట్ నాకు బాగా నచ్చింది. నిజంగానే థియేటర్లలో ఈ సినిమా పండగ చేస్తుండటం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన బన్నీ వాసు నాకు అత్యంత సన్నిహితుడు. అలాగే దర్శకుడు మారుతి కూడా నాకు మంచి మిత్రుడు. ఈ ఇద్దరూ కలిసి ఈ సినిమాతో హిట్ కొట్టడం నాకు మరింత ఆనందాన్ని కలిగించే విషయం. ఈ సినిమా విజయంలో నటీనటుల .. సాంకేతిక నిపుణుల పాత్ర ఎంతో వుంది. వాళ్లందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News