Trivikram: వచ్చే ఏడాది వెంకటేశ్ తో త్రివిక్రమ్ మూవీ

  • వరుస విజయాలతో వెంకటేశ్ 
  •  త్వరలో మొదలుకానున్న 'అసురన్'
  • తదుపరి సినిమా త్రివిక్రమ్ తో

వెంకటేశ్ తో ఒక సినిమా చేయనున్నట్టు త్రివిక్రమ్ ప్రకటించి చాలా కాలమే అయింది. గతంలో వెంకటేశ్ సినిమాలకి రచయితగా త్రివిక్రమ్ పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలన్నీ కూడా భారీ విజయాలను అందుకున్నాయి. ఈ నేపథ్యంలో వెంకటేశ్ తో సినిమా చేయనున్నట్టు త్రివిక్రమ్ చెప్పిన దగ్గర నుంచి అభిమానులంతా ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. ఇటీవల కాలంలో వెంకటేశ్ వరుస విజయాలను సొంతం చేసుకుంటూ వెళుతున్నారు. మళ్లీ ఆయన మార్కెట్ పుంజుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది వెంకటేశ్ తో ఒక సినిమా చేయడానికి త్రివిక్రమ్ రంగాన్ని సిద్ధం చేసే పనిలో వున్నాడట. 'అసురన్' రీమేక్ తరువాత వెంకటేశ్ తదుపరి సినిమా త్రివిక్రమ్ తోనే ఉంటుందని అంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

More Telugu News