Aadi Sai Kumar: నితిన్ చేతుల మీదుగా 'శశి' ఫస్టులుక్ పోస్టర్ రిలీజ్

  • ఆది సాయికుమార్ హీరోగా 'శశి'
  • డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న ఆది 
  •  కథానాయికగా కనిపించనున్న సురభి
ఈ రోజున ఆది సాయికుమార్ పుట్టినరోజు కావడంతో, ఆయన కొత్త సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ను కొంతసేపటి క్రితం వదిలారు. తాజాగా ఆయన మరో ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫస్టులుక్ పోస్టర్ ను హీరో 'నితిన్' చేతుల మీదుగా రిలీజ్ చేయించారు.

ఆది సాయికుమార్ హీరోగా 'శశి' చిత్రం రూపొందుతోంది. ఆది సాయికుమార్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ వదిలిన ఈ ఫస్టులుక్ పోస్టర్లో, ఆయన విభిన్నమైన లుక్ తో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన జోడీగా 'సురభి' నటిస్తోంది. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా తన కెరియర్లోనే ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందని ఆది సాయికుమార్ భావిస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.
Aadi Sai Kumar
Surabhi

More Telugu News