KCR: అందుకే కేసీఆర్ కు ముదిరాజ్ లంటే అభిమానం!: మంత్రి ఈటల

  • కేసీఆర్ తల్లికి 12 మంది సంతానం
  • పక్కనే ఆప్యాయంగా ముదిరాజ్ ల ఫ్యామిలీ
  • కేసీఆర్ కు ఆ ముదిరాజ్ తల్లి పాలిచ్చింది 

తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్ కులస్థుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా వెంకటగిరి క్రాస్ రోడ్స్ లోని ఓ మామిడి తోటలో ముదిరాజ్ ల వన భోజనాల కార్యక్రమం జరుగగా, ఈటల ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. "ముఖ్యమంత్రి కేసీఆర్ మాతృమూర్తికి 12 మంది సంతానం. దాంతో సరిపడా పాలు లేకపోవడంతో, వారి ఫ్యామిలీతో ఆప్యాయంగా ఉండే ముదిరాజ్ ల కుటుంబానికి చెందిన ఓ తల్లి పాలు తాగి కేసీఆర్ పెరిగారు. అందుకే కేసీఆర్ కు ముదిరాజ్ కులస్థులంటే ఎంతో అభిమానం. నాటి అనుబంధంతోనే వారి సంక్షేమంపై అత్యంత శ్రద్ధ చూపుతున్నారు" అన్నారు. ముదిరాజ్ ల బాధలన్నీ తెలుసుకుని, వారి ఆర్థికాభివృద్ధికి తమ ప్రభుత్వం బాటలు వేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మరో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు తదితరులు కూడా పాల్గొన్నారు.

More Telugu News