Revanth Reddy: భూకబ్జాల్లో టీఆర్ఎస్ నేతలు పోటీపడుతున్నారు: రేవంత్‌రెడ్డి

  • గత ఐదేళ్లలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి శూన్యం
  • టీఆర్ఎస్ నేతలు కోట్లకు పడగలెత్తారు
  • ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఎంఎంటీఎస్ రైలు మేడ్చల్ వరకు నడవడం లేదు
టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ పాలనలో ఆ పార్టీ నేతలు అభివృద్ధి చెందారు తప్పితే హైదరాబాద్‌లో అభివృద్ధి జరగలేదన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మున్సిపల్ ఎన్నికల సందర్బంగా నిన్న నిర్వహించిన సన్నాహక సదస్సులో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్ హయాంలో మాత్రమేనని పేర్కొన్నారు. ఈ విషయంలో తమతో చర్చించేందుకు టీఆర్ఎస్ నేతలు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. ఈ ఐదేళ్లలో టీఆర్ఎస్ నేతలు కోట్లకు పడగలెత్తారని రేవంత్ ఆరోపించారు. భూకబ్జాలు, అనుమతి లేని భవంతుల నిర్మాణంలో వారు పోటీపడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్లే కేంద్రం అనుమతి ఇచ్చినా ఎంఎంటీఎస్ రైలు మేడ్చల్ వరకు నడవడం లేదని రేవంత్ అన్నారు.
Revanth Reddy
TRS
Congress

More Telugu News