Telangana: రాజ్ భవన్ లో రాష్ట్రపతి గౌరవార్థం తేనీటి విందు

  • ఈ విందుకు హాజరైన మండలి చైర్మన్, స్పీకర్, సీఎం తదితరులు
  • రెడ్ క్రాస్ తెలంగాణ యాప్ ను ఆవిష్కరించిన రాష్ట్రపతి
  • ఈ యాప్ రూపకల్పన చేసింది సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గౌరవార్థం తెలంగాణ గవర్నర్ తమిళి సై తేనీటి విందు ఏర్పాటు చేశారు. రాజ్ భవన్ లో ఈ విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు.

కాగా, రెడ్ క్రాస్ తెలంగాణ యాప్ ను రాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ యాప్ ను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించింది. కాగా, శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రపతి దంపతులు రెండురోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు. రేపటి నుంచి 26వ తేదీ వరకు చెన్నై, పుదుచ్చేరి, తిరువనంతపురంలో కోవింద్ పర్యటిస్తారు. 27వ తేదీన రాష్ట్రపతి నిలయంలో తేనీటి విందు ఏర్పాటు చేశారు. 28వ తేదీ మధ్యాహ్నం 3.15 గంటలకు తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళతారు.
Telangana
Rajbhavan
President Of India
Ramnath kovind
Tamili sye
Governer
cm
kcr

More Telugu News