Andhra Pradesh: స్పీకర్ కళ్లులేని కబోదిలా మాట్లాడుతున్నారు: తమ్మినేనిపై వర్ల రామయ్య ఆగ్రహం

  • అమరావతిని ఎడారితో పోల్చిన తమ్మినేని
  • మండిపడిన వర్ల రామయ్య
  • ఎడారిలో కూర్చుని అసెంబ్లీ నడిపారా? అంటూ మండిపాటు
ఏపీ రాజధానికి వెళుతుంటే రాజస్థాన్ ఎడారిలోకి వెళుతున్నట్టుందని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. స్పీకర్ సీతారాం ఇన్నాళ్లు ఎడారిలో కూర్చుని అసెంబ్లీ నడిపించారా అని ప్రశ్నించారు. స్పీకర్ కళ్లులేని కబోదిలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ్మినేని మాటలు వింటుంటే బాధ్యత కలిగిన స్పీకర్ మాటల్లా లేవని అన్నారు. అయినా గౌరవ స్పీకర్ గారికి దృష్టిలోపం ఉందేమో అంటూ ఎద్దేవా చేశారు. ఓసారి కళ్లజోడు పెట్టుకుని రాజధానిలో పర్యటించాలని హితవు పలికారు.
Andhra Pradesh
Speaker
Thammineni Sitharam
Varla Ramaiah
Telugudesam
YSRCP
Amaravathi

More Telugu News