Amaravathi: అమరావతి రైతుల ఉద్యమం ఆపొద్దు.. కొనసాగించాలి: కమలానంద భారతిస్వామి
- మందడంలో రైతులకు సంఘీభావం తెలిపిన స్వామి
- రైతుల భద్రత, భవిష్యత్, జీవితం అమరావతితోనే ముడిపడి ఉంది
- అమరావతి ఉద్యమం జిల్లాల వారీగా విస్తరించాలి
ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఆలోచనతో తమకు నష్టం కలుగుతుందంటూ రాజధాని అమరావతి ప్రాంత రైతుల నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మందడంలో రైతుల నిరసనకు కమలానంద భారతిస్వామి తన సంఘీభావం తెలిపారు. రాజధాని అమరావతిపై చర్చలు, కమిటీలు అవసరమే లేదని, అందరి అంగీకారంతోనే అమరావతికి శంకుస్థాపన చేశారని అన్నారు.
రాజధానిగా అమరావతిని ప్రకటించే రోజున ఎవరూ అడగలేదని, ఈరోజు రాజధానిని మార్చాలని ఎవరూ అడగకున్నా దాన్ని మార్చాలని చూస్తూ వివాదం సృష్టిస్తున్నారని విమర్శించారు. అమరావతి రైతుల ఉద్యమం ఆపొద్దని కొనసాగించాలని సూచించారు. రైతుల భద్రత, భవిష్యత్, జీవితం, అమరావతితోనే ముడిపడి ఉందని వారికి చెప్పారు. అమరావతి ఉద్యమం జిల్లాల వారీగా విస్తరిస్తే, ప్రజాబలం పెరుగుతుందని, రాజధాని నిర్మాణం జరిగి తీరుతుందని, అందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని, రాజధాని అభివృద్ధిలో రాష్ట్ర ప్రజలందరూ భాగస్వామ్యులేనని అన్నారు.