Amaravathi: ఏపీ రాజధానిగా అమరావతి ఉండాలన్నదే టీడీపీ స్టాండ్: ప్రత్తిపాటి పుల్లారావు

  • సెబీ, రెరా వంటి చట్టాలు అమరావతికి రక్షణగా ఉన్నాయి
  •  కేంద్రం జోక్యం చేసుకోవాలి
  • రాజధానికి భూములిచ్చిన రైతులకు అండగా వుంటాం
ఏపీ రాజధానిగా అమరావతి ఉండాలన్నదే టీడీపీ స్టాండ్ అని ఆ పార్టీ నేత ప్రత్తిపాటి పుల్లారావు మరోమారు స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతి ఉండేలా చట్టపరమైన రక్షణ వుందని, సెబీ, రెరా వంటి చట్టాలు అమరావతికి రక్షణగా వున్నాయని చెప్పారు. సెబీ ద్వారా ప్రభుత్వం రూ.2 వేల కోట్లు సేకరించిందని, ఇప్పుడు సెబీకీ ఏం సమాధానం చెబుతుంది? రూ.10 వేల కోట్లతో నిర్మించిన కట్టడాలను ప్రభుత్వం ఏం చేస్తుంది? అని ప్రశ్నించారు. రాజధాని తరలింపు విషయమై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు అండగా వుంటామని తెలిపారు. 
Amaravathi
Telugudesam
prathipati
pullarao

More Telugu News