కోహ్లీ బొమ్మలతో 16 పచ్చబొట్లు పొడిపించుకున్న అభిమాని

22-12-2019 Sun 11:03
  • కోహ్లీ బ్యాటింగ్ శైలిని చూసి నేను ఆయన అభిమానిని అయ్యా
  • పచ్చబొట్లు పొడిపించుకొని ఆయనపై నాకున్న గౌరవాన్ని చాటాలనుకున్నా
  • అందుకే ఇలా చేశాను: అభిమాని పింటూ

టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్  గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఆయన బ్యాటింగ్ శైలికి అభిమానులు ఫిదా అయిపోతారు. ఈ అభిమానమే ఓ ఫ్యాన్ చేత ఒళ్లంతా కోహ్లీ బొమ్మలతో పచ్చబొట్లు పొడిపించుకునేలా చేసింది. ఒడిశాకు చెందిన పింటు బహేరా అనే ఓ అభిమాని తన శరీరంపై కోహ్లీ జెర్సీ నంబరు సహా ఆయన బొమ్మలతో 16 పచ్చబొట్లు పొడిపించుకున్నాడు.

'కోహ్లీ బ్యాటింగ్ శైలిని చూసి నేను ఆయన అభిమానిని అయ్యాను. పచ్చబొట్లు పొడిపించుకొని ఆయనపై నాకున్న గౌరవాన్ని చాటాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఇలా చేశాను' అని పింటూ మీడియాకు తెలిపాడు.