Tea: ఏమి'టీ' రుచి...ఎందుకా ధర! - రూ.40 వేలు పలికిన కిలో టీ పొడి

  • తేయాకు ప్రదర్శనలో ఈ ప్రత్యేకం 
  • ఆశ్చర్యపోయిన సందర్శకులు 
  • ప్రత్యేక బాక్స్ లో ఏడాదిన్నరపాటు పెంపకమే కారణం

అబ్బో...ఏమిటా ధర. ఏముందా రుచిలో అంటూ తేయాకు ప్రదర్శనలో ఆశ్చర్యపోతున్నారు సందర్శకులు. ఎందుకంటే అక్కడ కిలో టీపొడి 40 వేల రూపాయలు ఉండడమే కారణం. ఆ...అవాక్కయ్యారా. మీరు విన్నది నిజమే. నేను చెబుతున్నది కాఫీ పొడి ధర కాదు. టీ పొడి ధరనే. మీలాగే ఆ ప్రదర్శన తిలకిస్తున్న సందర్శకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే. తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లా కున్నూరు ఉపాసి ఆడిటోరియంలో ప్రత్యేక తేయాకు ప్రదర్శన ఏర్పాటు చేశారు.

ఈ ప్రదర్శనలో సేంద్రియ విధానంలో పండించిన పలు రకాల తేయాకుతో తయారు చేసిన గ్రీన్ టీ, వైట్ టీ, ఎల్లో టీ, ఆర్థోడెక్స్ తదితర పలు రకాల టీపొడులను ఉంచారు. ఇందులో 'భూఏర్' ఏజ్' రకం టీ పొడుల ధరలు కళ్లు జిగేల్ మనిపించాయి. ఎందుకంటే ఈ టీపొడి ధర 50 గ్రాములు రూ.2 వేలు అంటే కేజీ నలభై వేలు అన్నమాట. 

ఏమిటి దీని ప్రత్యేకత? ఎందుకంత ధర? అని సందర్శకులు ఆరాతీస్తే ఈ రెండు రకాలు ఆరోగ్యానికి శ్రేష్టమని, చైనీయులు ఎక్కువగా ఇష్టపడుతుంటారని ఆర్గానిక్ రైతు ప్రభురంజన్ తెలిపారు. ఈ తేయాకును ప్రత్యేక బాక్స్ లో ఏడాదిన్నరపాటు పెంచాలని తెలిపాడు.

More Telugu News