బీజేపీ ఎంపీ ప్రాగ్యాకు కోరుకున్న సీటు ఇవ్వని స్పైస్ జెట్!

  • ఎస్జీ 2489లో ప్రయాణించిన ప్రాగ్యా ఠాకూర్
  • సీటు కోసం అడిగితే, రూల్స్ చూపించాలని ప్రశ్న
  • ఎయిర్ పోర్టు డైరెక్టర్ కు ఎంపీ ఫిర్యాదు
తన విమాన ప్రయాణంలో ముందుగానే కోరుకున్న సీటును తనకు ఇవ్వలేదని బీజేపీ ఎంపీ ప్రాగ్యా ఠాకూర్ ఫిర్యాదు చేశారు. స్పైస్ జెట్ విమానంలో న్యూఢిల్లీ నుంచి రాజా భోజ్ ఎయిర్ పోర్టుకు ఎస్జీ 2489లో తాను వచ్చానని ఆమె పేర్కొన్నారు. తాను ముందుగానే ఓ సీటును బుక్ చేసుకున్నానని, ఆ సీటును ఇవ్వకపోగా, రూల్స్ చూపించాలని తనను ప్రశ్నించారని, ఈ విషయంలో ఎయిర్ పోర్టు డైరెక్టర్ కు ఫిర్యాదు చేశానని చెప్పారు.

కాగా, విమానం ల్యాండ్ అయిన తరువాత చాలా సేపు ఆమె కిందకు దిగలేదు. ఆపై మీడియాతో మాట్లాడుతూ, విమాన సిబ్బంది వైఖరితో తాను ఇబ్బందిగా ఫీల్ అయ్యానని అన్నారు. దీనిపై వివరణ ఇచ్చిన భోపాల్ ఎయిర్ పోర్టు డైరెక్టర్ అనిల్ విక్రమ్, ఎంపీ నుంచి ఫిర్యాదు అందిన మాట వాస్తవమని, దీనిపై సోమవారం నాడు విచారిస్తామని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Bhopal
Pragya Thakur
MP
Spice Get
Flight
Seat

More Telugu News