Mahesh Bhagawat: బైక్ పై గొడుగు వేసుకుని వెళుతున్నారా? ఈ వీడియో చూసి డిసైడ్ చేసుకోండి: మహేశ్ భగవత్

  • బైక్ పై నుంచి కిందపడిన యువతి
  • సాయం చేసిన స్థానికులు
  • ట్విట్టర్ లో వీడియో పోస్ట్
మీరు ఎప్పుడైనా బైక్ పై వెళుతూ, గొడుగు వేసుకుని వెళుతున్నారా? వర్షం పడుతున్నా, ఎండ అధికంగా ఉన్నా, బైక్ పై గొడుగు పట్టుకుని వెళ్లే వారు తరచూ కనిపిస్తూనే ఉంటారు. అయితే, ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డయిన వీడియోను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. బైక్ పై యువజంట వెళుతుండగా, వెనుక కూర్చున్న యువతి గొడుగును పట్టుకుని ఉంది. ఆమె దాని దిశను మార్చాలని ప్రయత్నించగా, గాలి ధాటికి ఆమె ఎగిరి కింద పడింది. ఆ వెంటనే స్థానికులు ఆమెకు సాయం చేశారు. ఇక ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదుగానీ, బైక్ పై వెళుతుంటే, గొడుగులను తెరిచి పట్టుకోవద్దని మహేశ్ భగవత్, ప్రజలకు సూచించారు.
Mahesh Bhagawat
Video
Twitter
Umbrella
Bike

More Telugu News