Bhim Chief chandrasekhar Azad: 'భీమ్ ఆర్మీ' చీఫ్ చంద్రశేఖర్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ

  • 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశం
  • తీస్ హాజారీ కోర్టులో చంద్రశేఖర్ ను ప్రత్యేకంగా హాజరు పర్చిన పోలీసులు
  • మరో 15మందికి రెండు రోజుల కస్టడీ విధించిన కోర్టు

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టిన భీమ్ ఆర్మీ స్థాపకుడు, చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌కు తీస్ హజారీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. నిన్నపాత ఢిల్లీలో భీమ్ నేతృత్వంలో వేలాది మందితో కలిసి ఆజాద్ భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనను తీస్ హజారీ కోర్టు ముందు పోలీసులు హాజరుపరిచారు. బెయిలు కోసం ఆయన పెట్టుకున్న అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చుతూ 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ తీర్పు చెప్పింది.

చంద్రశేఖర్ ఆజాద్ వేలాది మందితో కలిసి నిరసన  ప్రదర్శన చేపట్టడంతో పాటు హింసను రెచ్చగొట్టారని పోలీసులు పేర్కొన్నారు. కాగా, దరియాగంజ్ లో హింసాత్మక ఘటనలు చేటుచేసుకున్న నేపథ్యంలో 15 మంది ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసున్నారు. కోర్టు వారిని కోర్టు రెండు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అనుమతించింది. అయితే, ఆజాద్‌ను మాత్రం వీరితో కాకుండా విడిగా కోర్టులో హాజరుపరిచారు. ఆజాద్ సజీవంగా ఉన్నాడో లేడోనంటూ ఆయన తరఫు లాయర్ ఆందోళన వ్యక్తం చేయడంతో ఆయనను ప్రత్యేకంగా కోర్టులో పోలీసులు హాజరుపరిచారు.

More Telugu News