Peddireddy: రాజధానుల అంశం కేంద్రానికి సంబంధించిన విషయం కాదు: మంత్రి పెద్దిరెడ్డి

  • రాజధాని రాష్ట్ర పరిధిలోని విషయమన్న పెద్దిరెడ్డి
  • సీఎం జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వెల్లడి
  • అమరావతిలో రైతులు ఎవరూ లేరని వ్యాఖ్యలు
ఏపీ రాజధాని అంశంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశంతో కేంద్రానికి సంబంధం లేదని, ఇది రాష్ట్రానికి చెందిన అంశం అని స్పష్టం చేశారు. పాలన వికేంద్రీకరణ జరిగితే అభివృద్ధి కూడా జరుగుతుందని అన్నారు.

ఏదేమైనా సీఎం జగన్ నిర్ణయమే తమకు శిరోధార్యమని తెలిపారు. అమరావతిలో ఆందోళనలు చేస్తున్నవారు టీడీపీ కార్యకర్తలేనని, అమరావతిలో రైతులు ఎవరూ లేరని మంత్రి పేర్కొన్నారు. ఓ పార్టీకి చెందిన ఒకే సామాజికవర్గం వారు మాత్రమే అమరావతిలో భూములు కొన్నారని ఆరోపించారు. తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Peddireddy
Andhra Pradesh
YSRCP
Jagan
Amaravathi
Vizag

More Telugu News