YCP MP Vijayasaireddy: ఉత్తరాంధ్ర అభివృద్ధికే విశాఖను పాలన రాజధానిగా ప్రకటించారు: విజయసాయిరెడ్డి

  • ముంబై తరహాలో విశాఖ అభివృద్ధి చెందుతుంది
  • విశాఖకు జగన్ జన్మదిన కానుక ఇది  
  • ఆరు నెలల్లోనే జగన్ విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు
ఉత్తరాంధ్ర అభివృద్ధికే విశాఖను పాలనా రాజధానిగా తమ ప్రభుత్వం ప్రకటించిందని  వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.. రాష్ట్రంలోని  అన్ని జిల్లాలు అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతోనే తాము మూడు రాజధానుల ప్రతిపాదన చేశామని చెప్పారు. విశాఖపట్నంలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలను వైసీపీ నేతలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. విశాఖకు జగన్ జన్మదిన కానుక ఇది అని ఆయన పేర్కొన్నారు. విశాఖ కేంద్రంగా పరిపాలన సాగుతుందని.. పదేళ్లలో ముంబై తరహాలో విశాఖ అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే జగన్ విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారని ప్రశంసించారు.
YCP MP Vijayasaireddy
comments
on Visakha patnam
Visakha is Administration capital

More Telugu News