BJP: టీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో మండిపడిన బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు

  • 12 శాతం ఓట్ల కోసం మజ్లిస్‌కు సీఎం వత్తాసు
  • మతోన్మాద మజ్లిస్‌కు భయపడే పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు
  • అందరూ కలిసి గందరగోళం సృష్టిస్తున్నారు
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన టీఆర్ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిన్న విలేకరులతో ఆయన మాట్లాడారు. మతోన్మాద మజ్లిస్‌కు భయపడే పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఓటు వేసిందని తీవ్ర విమర్శలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై అందరూ కలిసి దేశంలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. మజ్లిస్, వామపక్షాలు, అర్బన్ నక్సలైట్లు, టీఆర్ఎస్‌ ఆలోచనా రహితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కేవలం 12 శాతం ఓట్ల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఒవైసీకి మద్దతు పలుకుతున్నారని రాంచందర్‌రావు పేర్కొన్నారు.
BJP
TRS
CAB
Ram chandra rao

More Telugu News