Google: వాణిజ్య ప్రకటనలపై గూగుల్ ఆధిపత్య ధోరణి.. రూ.1,180 కోట్ల జరిమానా విధించిన ఫ్రాన్స్

  • యాడ్స్ విషయంలో పారదర్శకత లేదు
  • వాణిజ్య ప్రకటనలు ఆమోదించేందుకు అనుసరిస్తున్న విధానాలు సరిగా లేవు
  • ఫ్రాన్స్ జరిమానాపై అప్పీలు చేస్తాం: గూగుల్
సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌కు ఫ్రాన్స్ రూ.1,180 కోట్ల జరిమానా విధించింది. ఆన్‌లైన్, వాణిజ్య ప్రకటనల మార్కెట్లో గూగుల్ ఆధిపత్య ధోరణి పెరిగిపోయిందని ఫ్రాన్స్ ఆరోపించింది. వాణిజ్య ప్రకటనలను ఆమోదించడానికి గూగుల్ అనుసరిస్తున్న విధానాలు పారదర్శకంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేసింది. గూగుల్‌లో ప్రకటనలు ఇచ్చే వారందరికీ ఒకే రకమైన నియమనిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తూ ఈ జరిమానా విధించింది. కాగా, ఇప్పటికే గూగుల్‌పై పలు దేశాలు వివిధ కారణాలతో భారీ జరిమానా విధించాయి. ఇప్పుడా జాబితాలో ఫ్రాన్స్ కూడా చేరింది. ఫ్రాన్స్ విధించిన జరిమానాపై అప్పీల్ చేస్తామని గూగుల్ ప్రకటించింది.
Google
France
fine

More Telugu News