JC Diwakar Reddy: పోలీసులతో బూట్లు నాకిస్తానంటూ వ్యాఖ్యలు చేసిన జేసీపై కేసు నమోదు

  • చంద్రబాబు పర్యటనలో తీవ్రవ్యాఖ్యలు చేసిన జేసీ
  • జేసీపై ఫిర్యాదు చేసిన పోలీసు అధికారుల సంఘం
  • పలు సెక్షన్లతో కేసు నమోదు చేసిన పోలీసులు
కొన్నిరోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించిన సందర్భంగా మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వేదికపై ఉండగా, పోలీసులతో బూట్లు నాకిస్తానంటూ వ్యాఖ్యానించారు. దీనిపై పోలీసు అధికారుల సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షుడు త్రిలోక్ అనంతపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సెక్షన్ 153, సెక్షన్ 506 కింద జేసీ దివాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి స్పందిస్తూ, జేసీపై చాలా ఫిర్యాదులు వచ్చాయని, అన్నింటినీ పరిశీలిస్తున్నామని తెలిపారు.
JC Diwakar Reddy
Telugudesam
Chandrababu
Police
Anantapur District

More Telugu News