Kurnool District: కర్నూలులో హైకోర్టు వద్దనే వారంతా తమ మనసు మార్చుకోవాలి: బీజేపీ నేత టీజీ వెంకటేశ్

  • జీఎన్ రావు కమిటీ నివేదికపై హర్షం
  • ఓ డిమాండ్ కూడా చేసిన టీజీ
  • కర్నూలులో మినీ సచివాలయం ఏర్పాటు చేయాలి

జీఎన్ రావు కమిటీ నివేదికపై బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నివేదికను ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. జీఎన్ రావు కమిటీ నివేదిక వెలువడ్డ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, శ్రీ బాగ్ ఒప్పందం, కమిటీ సిఫారసును, సీఎం జగన్ అభిప్రాయం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనే చెబుతున్నాయని అన్నారు.

కాబట్టి, కర్నూలులో హైకోర్టు వద్దని భావించే వారంతా తమ మనసు మార్చుకోవాలని సూచించారు. అదే సమయంలో ఓ డిమాండ్ చేశారు. కర్నూలులో మినీ సచివాలయం ఏర్పాటు చేయాలని అన్నారు. సెక్రటేరియట్, మినిస్టర్స్ క్వార్టర్స్ అనేవి రెండూ రెండు కళ్ల లాంటివని, వాటికి సంబంధించిన అంశాలన్నీ ఒకే చోట ఉండాలని, లేనిపక్షంలో పరిపాలనాపరమైన ఇబ్బందులు తప్పవని భావించారు.

More Telugu News