Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి నివాసంలో జీఎస్టీ సోదాలు... షూటింగ్ రద్దు చేసుకుని ఇంటిముఖం పట్టిన నటి

  • కోట్లల్లో సర్వీస్ ట్యాక్స్ ఎగవేసినట్టు ఆరోపణలు
  • కొనసాగుతున్న సోదాలు
  • కొంతకాలంగా హైదరాబాదులో నివాసం ఉంటున్న లావణ్య

టాలీవుడ్ యువ హీరోయిన్ లావణ్య త్రిపాఠి కోట్ల రూపాయల మేర సేవల పన్ను ఎగవేతకు పాల్పడ్డారంటూ జీఎస్టీ అధికారులు ఆమె నివాసంపై దాడులు చేపట్టారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) అధికారులు హైదరాబాదు జూబ్లీహిల్స్ లో ఉన్న లావణ్య త్రిపాఠి నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. అనేక పత్రాలను, వాటికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడంలో నిమగ్నమయ్యారు. కాగా, తన నివాసంపై జీఎస్టీ అధికారుల దాడుల విషయం తెలుసుకున్న లావణ్య త్రిపాఠి షూటింగ్ రద్దు చేసుకుని ఇంటిముఖం పట్టారు. ఇంకా అక్కడ సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News