Amaravathi: ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారుగా: అమరావతి నిరసనలలో ఓ రైతు

  • నాడు ప్రభుత్వం హామీలిచ్చి తమ పొలాలను తీసుకుంది
  • ఆ రోజున 30 వేల ఎకరాలు కావాలని జగనూ అన్నారు
  • ఆ భూములను పనికిరాకుండా చేసి తిరిగి ఇచ్చేస్తామంటారా?

ఏపీ ప్రభుత్వంపై రాజధాని ప్రాంత రైతులు మండిపడుతున్నారు. ఇక్కడి రైతుల నిరసనలు రెండో రోజూ కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తనను పలకరించిన మీడియాతో ఓ రైతు మాట్లాడారు. గత ప్రభుత్వం రైతుల నుంచి తీసుకున్న పొలాలను తిరిగి వెనక్కిచ్చేస్తామని ఓ మంత్రి చెబుతుండటంపై ఆ రైతు స్పందిస్తూ, ఆ భూములను పనికిరాకుండా చేసి ఇప్పుడు తమకు ఇస్తామంటే ఏం చేసుకుంటాం? అని ప్రశ్నించారు. నాడు ప్రభుత్వం ఏ హామీలైతే ఇచ్చి తమ పొలాలు తీసుకుందో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారని, ముప్పై వేల ఎకరాలు కావాలన్నారని గుర్తు చేశారు.

More Telugu News