Vizag: విశాఖలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది... ఆర్నెల్లుగా విజయసాయిరెడ్డి ఎవరెవర్ని కలిశారో చెప్పాలి: దేవినేని ఉమ

  • ఏపీ రాజధానిపై రగడ
  • అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం
  • స్పందించిన దేవినేని ఉమ
ఏపీ రాజధాని వ్యవహారంలో అధికార, విపక్షాల మధ్య తీవ్రస్థాయిలో పరస్పర విమర్శల పర్వం కొనసాగుతోంది. దీనిపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు కూడా స్పందించారు. ఇవాళ విశాఖపట్నం సహా మూడు రాజధానులు అంటున్న సీఎం జగన్ నాడు విపక్షనేతగా ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా అంగీకరించలేదా? అని ప్రశ్నించారు. విశాఖలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, అందుకనే అక్కడ రాజధానికి ప్రభుత్వం మొగ్గు చూపుతోందని ఆరోపించారు. గత ఆర్నెల్ల కాలంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖపట్నంలో ఎవరెవర్ని కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మధురవాడ, భోగాపురం ప్రాంతాల్లో ఇప్పటికే 6,000 ఎకరాలు వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లాయని తెలిపారు.
Vizag
Andhra Pradesh
Amaravathi
Devineni Uma
Vijay Sai Reddy
YSRCP
Jagan

More Telugu News