'రాజధాని' ఆందోళనలో పాల్గొన్న నాగబాబు.. బాడీవోర్న్ కెమెరాతో చిత్రీకరిస్తున్న పోలీసులు!
- రాజధాని గ్రామాల్లో అప్రకటిత బంద్ వాతావరణం
- ఎక్కడికక్కడ మోహరించిన పోలీసులు
- రైతుల దీక్షకు సంఘీభావం తెలిపిన నాగబాబు
మందడంలో సినీనటుడు నాగబాబు రైతుల దీక్షకు సంఘీభావం తెలిపారు. టోపీ పెట్టుకొని వచ్చి వారి మధ్య కూర్చొని ఆయన దీక్షలో పాల్గొన్నారు. ఆయనతో పాటు పలువురు జనసేన నేతలు, కార్యకర్తలు కూడా దీక్షలో పాల్గొంటున్నారు.
దీక్షల నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ మోహరించారు. రాజధానిలో నిరసనలకు దిగిన రైతుల వివరాలు సేకరిస్తున్నారు. బాడీవోర్న్ కెమెరాతో రైతుల ఆందోళనలు చిత్రీకరిస్తున్నారు.