Asaduddin Owaisi: మంగళూరులో ఇద్దరు ముస్లిం నిరసనకారులు చనిపోయారు: అసదుద్దీన్ ఒవైసీ

  • హైదరాబాదులో యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ సమావేశం
  • హాజరైన పలువురు ముస్లిం ముఖ్య నేతలు
  • సీఏఏను తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్న ఒవైసీ

హైదరాబాదులోని ఎంఐఎం ప్రధాన కార్యాలయంలో యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు ముస్లిం ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ, పౌరసత్వ సవరణ చట్టాన్ని అందరం తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

అయితే, పోలీసుల నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు. ఢిల్లీ, లక్నోల్లో పోలీసుల దాష్టీకాలను, హింసను మనం చూశామని... మంగళూరులో ఇద్దరు ముస్లిం నిరసనకారులు చనిపోయారని చెప్పారు. నిరసన కార్యక్రమాల్లో ఎక్కడైనా హింస చోటు చేసుకుంటే... దాన్ని మనం ఖండించాలని, ఆ కార్యక్రమం నుంచి మనం వైదొలగాలని సూచించారు. మరోవైపు, ఈ సమావేశం ఇంకా కొనసాగుతోంది.

More Telugu News