Smoking: పొగాకు ఉత్పత్తులకు దూరం...దూరం!

  • ధూమపానం, ఇతరత్రా అలవాట్లకు చెల్లు చీటీ 
  • ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పు
  • ధర, బహిరంగ ప్రదేశాల్లో నిషేధం ప్రభావం

ప్రపంచ వ్యాప్తంగా పొగరాయుళ్ల సంఖ్య అధికమే. ఇక వేర్వేరు రూపాల్లోని పొగాకు ఉత్పత్తులు వినియోగించే వారికీ లోటు లేదు. ముఖ్యంగా ధూమపాన ప్రియుల్లో ఎక్కువ మంది పురుషులు కాగా, పొగాకు ఉత్పత్తులు వినియోగించే వారిలో మహిళలు, పిల్లలు ఎక్కువ. అయితే పొగాకు ఉత్పత్తుల వినియోగం ప్రపంచ వ్యాప్తంగా తగ్గుముఖం పడుతోందని ఓ అధ్యయనం పేర్కొంది. గడచిన రెండు దశాబ్దాల్లో ఇది దాదాపు ఐదు శాతం వరకు ఉందని తేల్చింది.

సిగరెట్లపై భారీగా పెంచుతున్న సుంకాలు, బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగడంపై నిషేధం విధించడం వంటి అంశాలు పొగరాయుళ్లను కట్టడి చేస్తున్నాయని గుర్తించారు. అయితే పొగాకు ఉత్పత్తులు వినియోగించే వారి సంఖ్య తగ్గినా ఉత్పత్తుల వినియోగం మాత్రం గణనీయంగా పెరుగుతుండడం గమనార్హం.

ప్రపంచంలో ధూమపానం చేసే వారిలో 80 శాతం మంది పురుషులే. వీరిలో ఏటా 80 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో తాజా అధ్యయనం ఫలితాలు చూస్తే ప్రపంచ వ్యాప్తంగా ఏటా లక్షలాది మంది ప్రాణాలను బలితీసుకుంటున్న పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని అదుపు చేసే దిశగా కొన్నిదేశాలు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితం ఇస్తున్నాయని భావించాలి.

More Telugu News