Jagan: సీఎం ప్రకటనతో సగం చచ్చాం.. ఈయన వ్యాఖ్యలతో క్షోభకు గురవుతున్నాం: అమరావతి రైతులు

  • రాజధాని ప్రాంత రైతులకు భూములు వెనక్కి ఇచ్చేస్తామన్న పెద్దిరెడ్డి
  • ఈ విషయం వైసీపీ మేనిఫెస్టోలో లేదన్న రైతులు
  • రైతులతో రాజకీయం చేయవద్దంటూ మండిపాటు
మంత్రి పెద్దిరెడ్డిపై అమరావతి ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంత రైతులకు వారి భూములను వెనక్కి ఇచ్చేస్తామని పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. భూములను వెనక్కి ఇస్తామనే విషయం వైసీపీ మేనిఫెస్టోలో లేదని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ప్రకటనతో సగం చచ్చిపోయామని... పెద్దిరెడ్డి సహా ఇతర మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలతో తీవ్ర క్షోభను అనుభవిస్తున్నామని అన్నారు. అమరావతిలో నిరసన వ్యక్తం చేస్తున్నవారంతా టీడీపీవారే అంటూ పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా రైతులు తప్పుబట్టారు. అమరావతిలో ఏ పార్టీ జెండా లేదని అన్నారు. ఉన్నవన్నీ నల్ల జెండాలేనని చెప్పారు. రైతులతో రాజకీయం చేయవద్దని మండిపడ్డారు.
Jagan
Peddireddy
YSRCP
Amaravathi
Farmers

More Telugu News