Venkatesh: 'అసురన్' రీమేక్ రెగ్యులర్ షూటింగ్ కి తేదీ ఖరారు

  • వెంకటేశ్ తదుపరి చిత్రంగా 'అసురన్'
  • తమిళ హిట్ మూవీకి ఇది రీమేక్ 
  • జనవరి 2 నుంచి రెగ్యులర్ షూటింగ్ 

వెంకటేశ్ తాజా చిత్రంగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'వెంకీమామ' భారీ విజయాన్ని అందుకుంది. అన్ని ప్రాంతాల్లోను వసూళ్ల పరంగా తన దూకుడును కొనసాగిస్తోంది. ఈ సినిమా సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో వెంకటేశ్ తన తదుపరి సినిమాకి రెడీ అవుతున్నాడు. ఆయన తదుపరి సినిమాగా 'అసురన్' రీమేక్ రూపొందనుంది.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో .. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా, జనవరి 2వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు రామానాయుడు స్టూడియోలో చకచకా జరిగిపోతున్నాయి. కీలకమైన సన్నివేశాలను ఇక్కడ వేస్తున్న సెట్స్ లో చిత్రీకరించనున్నారు. హీరోయిన్ తో పాటు ఇతర నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. వెంకటేశ్ హీరోగా సురేశ్ ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను ప్రకటించిన దగ్గర నుంచి అంచనాలు పెరుగుతూ వెళుతున్నాయి.

More Telugu News