Andhra Pradesh: అమరావతిలో రెండో రోజూ ప్రారంభమైన ఆందోళనలు

  • మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తున్న అమరావతి ప్రజలు
  • అమరావతిని రాజధానిగా ప్రకటించే వరకు ఆందోళన కొనసాగుతుందని హెచ్చరిక
  • ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టొద్దని వేడుకోలు

మూడు రాజధానుల ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏపీ రాజధాని అమరావతిలో మొదలైన ఆందోళనలు రెండో రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు రోడ్డుపై బైఠాయించిన రైతులు ముఖ్యమంత్రి జగన్ ప్రకటనపై నిరసన వ్యక్తం చేశారు. అమరావతిని రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు, వెలగపూడిలో రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ‘3 రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు’ అనే పోస్టర్లు ప్రదర్శిస్తున్నారు. ప్రాంతాల మధ్య చిచ్చే రేపొద్దంటూ పెద్ద ఎత్తున నినదిస్తున్నారు. కాగా, ఈ మధ్యాహ్నం తుళ్లూరులోని ప్రధాన రహదారిపై వంటావార్పు చేపట్టనున్నట్టు జేఏసీ సభ్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News