Jharkhand: ఝార్ఖండ్‌లో ప్రారంభమైన తుదిదశ ఎన్నికల పోలింగ్.. బారులు తీరిన ఓటర్లు

  • 16 నియోజకవర్గాల్లో కొనసాగుతున్న పోలింగ్
  • బరిలో మాజీ ముఖ్యమంత్రి, మంత్రులు
  • 23న ఫలితాలు

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోలింగ్ ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సమస్యాత్మక ప్రాంతాల్లో మధ్యాహ్నం మూడు గంటలకే పోలింగ్ ముగియనుండగా, మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

మొత్తం 16 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా మొత్తం 40,05,287 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత అయిన హేమంత్ సోరెన్, ఇద్దరు మంత్రులు ఈ విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. హేమంత్ సోరెన్ దుమ్‌కా, బర్‌హెట్ స్థానాల నుంచి బరిలో నిలవగా, దమ్‌కాలో ఆయనకు ప్రత్యర్థిగా బీజేపీ మహిళా నేత, రాష్ట్ర శిశు సంక్షేమశాఖ మంత్రి లూయిస్ మారండీ పోటీలో ఉన్నారు. శరత్ నియోజకవర్గం నుంచి ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి రాన్‌ధిర్‌సింగ్ బరిలోకి దిగారు. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

More Telugu News