Amaravathi: రేపు అమరావతిలో పర్యటించనున్న ‘జనసేన’ నేతలు

  • రేపు ఉదయం పది గంటలకు పర్యటన ప్రారంభం
  • మంగళగిరిలోని కార్యాలయం నుంచి బయలుదేరతారు
  • రైతులను కలిసి వారితో మాట్లాడతారు: జనసేన

‘ఒక రాష్ట్రం, మూడు రాజధానులు’ అనే ప్రకటనతో తీవ్ర ఆందోళనలో ఉన్న రాజధాని గ్రామాల రైతులను తమ నాయకులు కలుస్తారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూచన మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నేతృత్వంలోని బృందం రాజధాని గ్రామాల్లో పర్యటిస్తుందని తెలిపింది.

 రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబుతో పాటు కమిటీ సభ్యులు, అధికార ప్రతినిధులు ఈ పర్యటనలో పాల్గొంటారని పేర్కొంది. రేపు ఉదయం పది గంటలకు మంగళగిరిలోని జనసేన కార్యాలయం నుంచి బయలుదేరి మందడంలో రైతాంగం, రైతు కూలీలతో మాట్లాడతారని తెలిపింది. అనంతరం వెలగపూడిలో రైతుల నిరాహార దీక్ష శిబిరానికి వెళ్తారని, మధ్యాహ్నం ఒంటి గంటకు తుళ్ళూరులో ‘వంటా వార్పు’ కార్యక్రమానికి హాజరవుతారని వివరించింది.

More Telugu News