గుంటూరులో మరో దారుణం.. నేపాలీ బాలికపై అత్యాచారం!
- స్థానిక కొత్తపేటలో ఘటన
- నాలుగేళ్ల బాలికపై నలభై ఏళ్ల వ్యక్తి అఘాయిత్యం
- బాలిక తండ్రి ఫిర్యాదు.. పోలీసుల అదుపులో నిందితుడు
బాలిక తండ్రి నూడిల్స్ పని, తల్లి బయట పనులు చేస్తుంటుంది. వాళ్లిద్దరూ ఇంట్లో లేని సమయంలో చూసి ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బాలికను బెదిరించినట్టు సమాచారం. పని ముగించుకుని సాయంత్రం ఇంటికి తిరిగొచ్చిన తండ్రికి తమ కూతురు ఇంట్లో లేకపోవడంతో పక్కింట్లో వెతకగా, వేణుగోపాల్ వద్ద తమ కూతురు ఉండటం గమనించాడు. అనంతరం జరిగిన ఘోరాన్ని గ్రహించిన బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, పదిరోజుల వ్యవధిలో గుంటూరులో ఈ తరహా ఘటనలు మూడు జరిగాయి. స్థానిక రామిరెడ్డి తోటలో ఐదేళ్ల బాలికపై ఇంటర్ విద్యార్థి, ఆర్.అగ్రహారంలో మూడేళ్ల బాలికపై ఎనభై ఏళ్ల వృద్ధుడు దారుణాలకు పాల్పడగా, తాజాగా, కొత్తపేటలో ఈ ఘటన జరిగింది.