Andhra Pradesh: వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరులు?

  • ఆదినారాయణరెడ్డి సోదరులు శివనాథరెడ్డి, నారాయణరెడ్డి
  • ఈ నెల 23న వైసీపీలో చేరతారని సమాచారం
  • సీఎం జగన్ ని ఇప్పటికే సంప్రదించినట్టు తెలుస్తోంది

కడప జిల్లాకు చెందిన ఏపీ మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరులు వైసీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరినప్పటికీ, ఆయన సోదరులు, ఎమ్మెల్సీ శివనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ఇంకా టీడీపీలోనే కొనసాగుతున్నారు. అయితే, పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 23న వైసీపీలో వీళ్లిద్దరూ చేరనున్నట్టు తెలుస్తోంది. ఏపీ సీఎం, వైసీపీ
అధినేత జగన్ ను ఇప్పటికే వీళ్లిద్దరూ సంప్రదించినట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News