Andhra Pradesh: ఏపీని దక్షిణాఫ్రికాతో పోల్చి రాష్ట్ర ప్రజలను అవమానించారు: టీడీపీ నేత ధూళిపాళ్ల

  • జగన్ నిర్ణయాలు తెలంగాణకు వరంగా మారాయి
  • అధికార వికేంద్రీకరణ జరిగితే అభివృద్ధి జరగదు
  • రాజధానికోసం భూములిచ్చిన రైతులకు అన్యాయం చేయొద్దు

ఏపీ రాజధాని విషయంలో మూడు రాజధానుల కాన్సెప్ట్ ను తెరపైకి తెచ్చిన సీఎం జగన్ తీరుపై ప్రతిపక్ష టీడీపీ నేతలు విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నారు. దక్షిణాఫ్రికా దేశంలో ఉన్న మూడు రాజధానుల మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లో కూడా మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ను దక్షిణాఫ్రికాతో పోల్చి ఏపీ ప్రజలను సీఎం జగన్ అవమానించారని మండిపడ్డారు. జగన్ నిర్ణయాలు తెలంగాణకు వరంగా మారాయన్నారు. అధికార వికేంద్రీకరణ జరిగితే అభివృద్ధి జరగదన్నారు. తప్పులు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు. రాజధానికోసం భూములిచ్చిన రైతులకు మాత్రం అన్యాయం చేయొద్దని ఈ సందర్భంగా సీఎం జగన్ ను నరేంద్ర కోరారు.

More Telugu News