NGT: ఏపీలో ఇసుక తవ్వకాలపై తాజాగా నివేదిక కోరిన జాతీయ హరిత ట్రైబ్యునల్

  • కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లకు ఆదేశం
  • నెలరోజుల్లో నివేదిక సమర్పించాలని గడువు
  • లేనిపక్షంలో రూ.100 కోట్ల జరిమానా విధిస్తామని హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక అక్రమ తవ్వకాలపై కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు అనుసరిస్తున్న తీరును జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్ జీటీ) తప్పు బట్టింది. ఆ సంస్థల నివేదికలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని పేర్కొంది.

రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై రైతు ప్రతినిధి అనుమోలు గాంధీ జాతీయ హరిత ట్రైబ్యునల్ లో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో ఎన్ జీటీ దీనిపై విచారణ జరిపింది. ఇసుక తవ్వకాలపై జరిపిన అధ్యయనం వివరాలు, చర్యలపై నెలరోజుల్లో నివేదిక రూపంలో తమకు సమర్పించాలని ఆదేశించింది. లేనిపక్షంలో రూ.100 కోట్ల జరిమానా కట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది. తదుపరి విచారణను 2020 ఫిబ్రవరి 14కు వాయిదా వేసింది.

More Telugu News