Narayana: నారాయణ, శ్రీచైతన్య కాలేజీలపై విచారణకు ఆదేశించిన తెలంగాణ హైకోర్టు

  • నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయంటూ హైకోర్టులో పిల్
  • విచారణ జరపాలని ఇంటర్ బోర్డును ఆదేశించిన హైకోర్టు
  • నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
నారాయణ, శ్రీచైతన్య కాలేజీలకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఈ రెండు కాలేజీలపై విచారణ జరపాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే, ఈ రెండు కాలేజీలు పలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయంటూ రాజేష్ అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన హైకోర్టు... ఈ కాలేజీలపై పూర్థి స్థాయిలో విచారణ జరపాలని ఇంటర్ బోర్డును ఆదేశించింది. నాలుగు వారాల్లో పూర్తి నివేదికను తమకు అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
Narayana
Sri Chaitanya
High Court

More Telugu News