High Court: హైకోర్టు తరలింపుపై అభ్యంతరం.. విజయనగరం లాయర్ల నిరసన

  • హైకోర్టును కర్నూలుకు తరలిస్తామని చెప్పడంపై విజయనగరం లాయర్ల ఆందోళన
  • ప్రజలు, లాయర్లు ఇబ్బంది పడతారని వ్యాఖ్య
  • అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్
రాష్ట్రానికి మూడు రాజధానులు వచ్చే అవకాశం ఉందంటూ ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా... మరి కొందరు తప్పుబడుతున్నారు. హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు మారుస్తామని చెప్పడంపై ఉత్తరాంధ్ర లాయర్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలో విజయనగరం జిల్లా లాయర్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ ఉదయం విజయనగరంలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హైకోర్టును కర్నూలుకు తరలించడం వల్ల ప్రజలు, లాయర్లు ఇబ్బంది పడతారని చెప్పారు. అమరావతిలోనే హైకోర్టును కొనసాగించాలని... లేని పక్షంలో విశాఖపట్టణంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
High Court
Kurnool
Amaravathi
Vijayanagaram Lawyers

More Telugu News