వివాహేతర సంబంధం కొనసాగించాలని వేధింపులు.. నిరాకరించిన మహిళపై కత్తితో దాడి
- భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తున్న మహిళ
- గత పరిచయాన్ని అడ్డం పెట్టుకుని వేధిస్తున్న నిందితుడు
- కల్లు గీసే కత్తితో దాడి
అతడి వేధింపులు రోజురోజుకు ఎక్కువ అవుతుండడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిని జైలుకు పంపారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన నారంబాబు పెద్దమనుషుల సమక్షంలో ఆమె వెంటపడనని హామీ ఇచ్చాడు. అయినప్పటికీ తీరు మార్చుకోని నిందితుడు ఈ నెల 18న మరోమారు బాధితురాలి ఇంటికి వెళ్లి వేధించాడు. వివాహేతర సంబంధానికి ఆమె నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన నిందితుడు వెంట తెచ్చుకున్న కల్లుగీసే కత్తితో ఆమెపై దాడిచేశాడు.
దీంతో షాక్కు గురైన బాధితురాలు అరవడంతో అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, బాధితురాలు తనకు మూడు లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉందని, అడగడానికి వెళ్తే దుర్భాషలాడిందని, అందుకే ఆమెపై దాడిచేశానని నిందితుడు తెలిపాడు.