jc diwakar reddy: క్షమాపణలు చెబుతారా.. కేసు పెట్టమంటారా?: జేసీకి పోలీసు సంఘం హెచ్చరిక

  • పోలీసులపై జేసీ వివాదాస్పద వ్యాఖ్యలు
  • తాము అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరిక
  • క్షమాపణలు చెప్పకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక

తాము అధికారంలోకి వచ్చాక బూట్లు నాకే అధికారులను తెచ్చుకుంటామని, అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టబోమంటూ అనంతపురంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది. జేసీ వెంటనే  పోలీసులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. క్రిమినల్ కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడబోమని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

  • Loading...

More Telugu News