Janvi Kapoor: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

  • జాన్వీకి భారీ పారితోషికం 
  • అజిత్ సినిమాలో తెలుగు యంగ్ హీరో
  • బయోపిక్ లో తల్లి పాత్రలో అమల

*  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న 'ఫైటర్' చిత్రంలో శ్రీదేవి కూతురు జాన్వి కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు గాను ఆమెకు 3.5 కోట్ల పారితోషికాన్ని ఇస్తున్నట్టు ఫిలిం సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.
*  ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరో కార్తికేయ త్వరలో ఓ తమిళ చిత్రంలో విలన్ పాత్రను పోషించనున్నాడు. అజిత్ హీరోగా హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న 'వాలిమై' చిత్రంలో ఓ నెగటివ్ పాత్రకు కార్తికేయను తీసుకుంటున్నారట. ఇటీవల నాని నటించిన 'గ్యాంగ్ లీడర్' చిత్రంలో కూడా కార్తికేయ నెగటివ్ పాత్రను పోషించిన సంగతి విదితమే. 
*  సుదీర్ బాబు హీరోగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ బయోపిక్ రూపొందుతోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గోపీచంద్ తల్లి సుబ్బరావమ్మ పాత్రను ప్రముఖ నటి అక్కినేని అమల పోషిస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News