Jagan: మీ నాన్నగారికి గుడికట్టి, మీకు మద్దతు పలికిన ఓ దళితుడి పరిస్థితి చూడండి!: నారా లోకేశ్

  • సీఎం జగన్ పై లోకేశ్ ధ్వజం
  • పాలనపై విమర్శలు
  • చెత్తపాలన అంటూ ట్వీట్
సీఎం జగన్ పాలనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ధ్వజమెత్తారు. జగన్ గారూ, మీ మాటలకు, చేతలకు ఆకాశానికి, భూమికి మధ్య ఉన్నంత దూరం ఉంది. మీరు అసెంబ్లీలో ఎస్సీ కార్పొరేషన్ బిల్ ప్రవేశపెట్టిన రోజే, మీ నాన్నగారికి గుడికట్టి, మీకు మద్దతిచ్చిన ఓ దళితుడికి ఎంతటి దుస్థితి పట్టిందో చూడండి అంటూ ఓ వీడియోను పోస్టు చేశారు. తన నియోజకవర్గంలో పార్టీ కన్వీనర్ తనను అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నాడని, పార్టీ నుంచి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ దళితుడు బూటుతో తనను తాను కొట్టుకోవడం ఆ వీడియోలో కనిపించింది.

మీ పార్టీకి మద్దతిచ్చినందుకు ఓ వ్యక్తి తనను తాను చెప్పుతో కొట్టుకునే పరిస్థితి వచ్చిందన్న లోకేశ్, దీన్నిబట్టే మీ పాలన ఎంత చెత్తగా ఉందో అర్థమవుతోందని విమర్శించారు. దళితులపై వైసీపీ నాయకుల అకృత్యాలకు ఇదొక ఉదాహరణ వైఎస్ జగన్ గారూ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
Jagan
Nara Lokesh
Andhra Pradesh
Telugudesam
YSRCP

More Telugu News