Nara Lokesh: అసెంబ్లీ ఎదుట ప్లకార్డులు పట్టుకున్న నారా లోకేశ్

  • ఏపీ సర్కారు పాలనపై టీడీపీ ధ్వజం
  • అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా నిరసనలు
  • ఉచిత ఇసుక పాలసీ కోసం టీడీపీ డిమాండ్
వైసీపీ ప్రభుత్వ పాలనపై టీడీపీ తీవ్రస్థాయిలో స్పందిస్తోంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా అటు నిరసనలు, ఇటు సభలో విమర్శలు వంటి కార్యక్రమాలతో టీడీపీ నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా టీడీపీ నేతలు అసెంబ్లీ ఎదుట ఆందోళన కార్యక్రమం చేపట్టగా, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక పాలసీ అమలు చేయాలని, భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక, 165 మంది ఎస్సీ కుటుంబాలను ఊళ్లో నుంచి తరిమేస్తారా? 545 కుటుంబాలను గ్రామ బహిష్కారం చేస్తారా? అనే ప్లకార్డును లోకేశ్ ప్రదర్శించారు.
Nara Lokesh
Telugudesam
Andhra Pradesh
YSRCP
Jagan
Chandrababu
Assembly

More Telugu News