Mangalagiri: చరిత్ర సృష్టించేందుకు మంగళగిరిలో పోటీచేశాడట చిట్టినాయుడు!: విజయసాయిరెడ్డి

  • లోకేశ్ పై విజయసాయి వ్యాఖ్యలు
  • దొడ్డిదారిన మంత్రి అయ్యావంటూ విమర్శలు
  • బడాయి మాటలు మానుకో చిట్టీ అంటూ ట్వీట్
ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ యువ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పై మరోసారి విమర్శలు చేశారు. 'చిట్టినాయుడు మంగళగిరిలో చరిత్ర సృష్టించేందుకే పోటీచేశాడట!' అంటూ వ్యంగ్యం కురిపించారు. 'ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేకనే కదా దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయింది, మంత్రి అయింది' అంటూ ట్వీట్ చేశారు. ఎన్నికల్లో రెండొందల కోట్లు వెదజల్లినా మంగళగిరిలో చిత్తుగా ఓడిపోయావు, ఇకనైనా బడాయి మాటలు మానుకో చిట్టీ అంటూ వ్యాఖ్యానించారు.
Mangalagiri
Guntur District
Nara Lokesh
Vijay Sai Reddy
Telugudesam
YSRCP

More Telugu News