Kodandarami Reddy: హీరోని అవుదామనే ఇండస్ట్రీకి వచ్చాను: దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి

  • హీరోను కావాలని ఉండేది 
  • మద్రాస్ వెళ్లి సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాను
  • నా చేతి రాత నా తల రాతను మార్చిందన్న కోదండరామిరెడ్డి 

తెలుగు తెరపై విభిన్నమైన కథలను పరిగెత్తించిన దర్శకులలో కోదండరామిరెడ్డి ఒకరు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తన సినీ ప్రయాణం ఎలా మొదలైందనేది ప్రస్తావించారు. "1969లో హీరోను అవుదామని నెల్లూరు నుంచి మద్రాసు వెళ్లాను. అక్కడ సినిమా ఆఫీసులకి వెళ్లి కలవడానికి ప్రయత్నించేవాడిని. అయితే గేటు దగ్గరుండే వాచ్ మన్ లు ఎవరూ కూడా లోపలికి రానిచ్చేవారు కాదు.

పెద్దగా డబ్బులేదు .. చదువులేదు .. తెలిసినవాళ్లు లేరు. అలాంటప్పుడు ఎవరు అవకాశం ఇస్తారు? అని ఆలోచనలో పడ్డాను. చివరికి ఒకాయన నన్ను దర్శకుడు పీసీ రెడ్డిగారి దగ్గరికి తీసుకెళ్లారు. నేను హీరోను కావడానికి వచ్చినట్టు ఆయనకి చెప్పాను. "నీ మొహంలే .. రేపు ఒకసారి జెమిని స్టూడియోకి రా .. అక్కడ దర్శకుడు వి. మధుసూదనరావు గారికి పరిచయం చేస్తాను. ఆయన 'మనుషులు మారాలి' సినిమా చేస్తున్నారు. ఆయన ఓకే అంటే నీకు జాబ్ దొరికినట్టే అన్నారు. మర్నాడు నేను స్టూడియోకి వెళితే ఆయనని పరిచయం చేశారు. నా హ్యాండ్ రైటింగ్ చూసి, నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ గా పెట్టుకున్నారు. అలా ఆ రోజు నుంచి నా సినిమా ప్రస్థానం మొదలైంది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News